Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీ ప్లేన్ ట్రయల్ రన్ విజయవంతం... శ్రీశైలంలో ల్యాండింగ్

Sea Plane trial run successful from Vijayawada to Srisalam
Advertisement
  • ఏపీలో వాటర్ టూరిజం అభివృద్ధికి కూటమి ప్రభుత్వ చర్యలు
  • విజయవాడ-శ్రీశైలం మధ్య సీ ప్లేన్ సర్వీసు
  • నేడు ప్రకాశం బ్యారేజి నుంచి బయల్దేరి శ్రీశైలంలో కృష్ణా జలాలపై దిగిన ప్లేన్
  • రేపు సీ ప్లేన్ సర్వీసును ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు 
Advertisement
ఏపీలో వాటర్ టూరిజంను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ క్రమంలో, నేడు సీ ప్లేన్ ట్రయల్ రన్ ను విజయవంతంగా నిర్వహించారు. 

విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి టేకాఫ్ తీసుకున్న ఈ సీ ప్లేన్ విజయవంతంగా శ్రీశైలం వద్ద కృష్ణా జలాల్లో ల్యాండయింది. అక్కడ్నించి నీటిపైనే ప్రయాణిస్తూ శ్రీశైలంలోని బోటింగ్ జెట్టీ వద్దకు చేరుకుంది. టూరిజం, ఎయిర్ ఫోర్స్, ఏపీ పోలీస్, ఎస్టీఆర్ఎఫ్ అధికారులు ఈ ట్రయల్ రన్ ను పర్యవేక్షించారు. 

నేటి ట్రయల్ రన్ విజయవంతమైన నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (నవంబరు 9) సీ ప్లేన్ ను విజయవాడ పున్నమి ఘాట్ నుంచి ప్రారంభించనున్నారు.
Advertisement
Advertisement
Sea Plane
Trial Run
Srisailam
Vijayawada
TDP-JanaSena-BJP Alliance

More Telugu News